గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

ప్రాణభయంతో బంకర్‌లో దాక్కొన్న పుతిన్.. ఎందుకో తెలుసా?

putin
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రాణభయం పట్టుకుంది. దీంతో ఆయన బంకర్‌లోకి వెళ్లిపోయారు. దీనికి కారణం ఫ్లూ వైరస్. ఈ వైరస్ రష్యాను వణికిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలకు విస్తరించింది. మరికొన్ని ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తుంది. అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. ముఖ్యంగా, క్రెమ్లిన్‌లోని పలువురు ప్రభుత్వ అధికారులకు ఈ వైరస్ సోకింది. వీరిలో పుతిన్ స్నేహితులు, సన్నిహితులు కూడా ఉన్నారు. దీంతో వారంతా ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పుతిన్ కూడా ఫ్లూ వైరస్ సోకుతుందన్న భయంతో బంకర్‌లోకి వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన అక్కడ నుంచి పాలన సాగిస్తున్నారు. ఈయన బంకర్‌లో ఉన్న ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్త సంవత్సర వేడుకలను కూడా ఆయన ఇక్కడే జరుపుకుంటారని స్థానిక మీడియా తెలిపింది.
 
నిజానికి పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వివిధరకాలైన కథనాలు వస్తున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు రష్యా మీడియానే వార్తా కథనాలను ప్రసారం చేస్తుంది. దీనికితోడు తన నివాసంలో మెట్లు దిగుతూ అదుపుతప్పి కిందపడిపోయారంటూ ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందనే కథనాలు వస్తున్నాయి. 
 
మరోవైపు, పుతిన్ కేన్సర్‌తో పోరాడుతున్నట్టు యూకే ఇంటెలిజెన్స్ కూడా ఓ నివేదికను వెల్లడించింది. పైగా, ఆయన మరెన్నో రోజులు బతకరని పేర్కొనగా ఈ వార్తలన్నింటిపై రష్యా ప్రభుత్వం ఏ రూపంలోనూ స్పందించక పోవడం గమనార్హం.