శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (10:53 IST)

మరోమారు తండ్రికాబోతున్న 69 యేళ్ళ రష్యా అధినేత పుతిన్!

putin
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిని మరోమారు తండ్రి కాబోతున్నారు. ఈయనకు వయసు 69 యేళ్లు. మాజీ జిమ్నాస్ట్ అయిన ప్రియురాలు కబేవా (39) త్వరలోనే ఆ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వస్తున్నాయి. 
 
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన కబేవాకు పుతిన్ ద్వారా ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. కానీ, వీరి వివరాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. 
 
నిజానికి పుతిన్ వ్యక్తిగత జీవితం అంతా ఎంతో గోప్యంగా ఉంటుంది. పుతిన్ మాజీ భార్య లియుద్ మిలాతో పుతిన్‌కు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు వొరొత్సోవా (37) ఓ వ్యాపారవేత్త. మరో కుమార్తె కేటెరినా (35) ఓ శాస్త్రవేత్త. పైగా, మాజీ డ్యాన్సర్ కూడా. ఈ నేపథ్యంలో ఇపుడు మరోమారు ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతుందట.