సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (20:26 IST)

Father's Day Gift 2022 ideas:ఏం కొనాలని అయోమయంలో వున్నారా?

Happy Fathers Day
Happy Fathers Day
ఫాదర్స్ డే జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోబడుతోంది. ఫాదర్స్ డే రోజున తండ్రికి మంచి మంచి కానుకలు ఇవ్వాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వారు మీరైతే ఈ స్టోరీ చదవండి. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి, నాన్నను అవిఇవీ కొనిపెట్టమని చెప్తునే వుంటాం. 
 
అలాంటి వ్యక్తిని ఫాదర్స్ డే ఒక్కరోజైనా సంతోషపెట్టాలని ఆశిస్తాం. అందుకోసం గిఫ్టులు కొంటాం.  ఫాదర్స్ డే కోసం మీ నాన్న కొరకు ఏమి కొనాలనే దానిపై అయోమయంలో వుంటే బాధపడకండి, ఎందుకంటే మీ కోసం ప్రత్యేక గిఫ్ట్ జాబితానే వుంది. 
Fathers day
Fathers day


జూన్ 19, ఆదివారం నాడు ఈ ఫాదర్స్ డే, ఈ రోజున మీ నాన్నను ఒక ఆలోచనాత్మక బహుమతితో ఆశ్చర్యపరచండి. గిఫ్టులతో కాకపోయినా వారితో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు.  
 
బడ్జెట్ గిఫ్ట్ ఐడియాలు
రూ. 500 కంటే తక్కువ చాక్లెట్లు, పుస్తకాలు
రూ. 500 నుంచి రూ. 1,000 కస్టమైజ్డ్ మగ్, ఫోటో ఫ్రేమ్
రూ. 1,000 నుంచి రూ. 2,000 షేవింగ్ కిట్, ఒక వాలెట్, ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్
రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు డిజిటల్ ఫిట్ నెస్ బ్యాండ్, బ్లూటూత్ స్పీకర్
రూ. 5,000 నుంచి రూ. 10,000 పోర్టబుల్ డిజిటల్ ఆడియో ప్లేయర్, బ్రాండెడ్ సన్ గ్లాసెస్
రూ. 10,000 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్, డిజైనర్ వాచ్.
 
పుస్తకాలు చదవటం మీ నాన్నకు ఇష్టమైతే, అతనికి ఒక పుస్తకం లేదా కొన్ని పుస్తకాలను కొనిపెట్టండి. రొమాన్స్, మిస్టరీ, థ్రిల్లర్ వంటి ఏ జానర్ అయినా సరే, విభిన్న జానర్స్‌కు చెందిన 2-4 పుస్తకాల కాంబోను కూడా మీరు కొనిపెట్టవచ్చు. 
Fathers day
Fathers day
 
ఒక తండ్రి తన కుటుంబానికి చేసిన సేవలను గౌరవించడానికి ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఇది ఒక తండ్రీబిడ్డ మధ్య పితృ బంధాన్ని దృఢంగా వుంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జూన్ లో మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 19వ తేదీ ఆదివారం నాడు దీనిని జరుపుకోనున్నారు.