సోమవారం, 6 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (11:01 IST)

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

thama - rashmika
రష్మిక మందన్నా - ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన చిత్రం థామా. ఆదిత్య దర్శకుడు. కొన్ని అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ చిత్రం. వినోదం ఉన్నా.. ఇందులో ప్రేమే ముఖ్య కథాంశం. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ఈ బ్యూటీ నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరు 7వ తేదీన ఇది విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రం నుంచి నువ్వు నాకు సొంతమా అనే పాటను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దీంతో రష్మిక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. 
 
ఈ నేపథ్యంలో రష్మిక పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాజాగా విడుదలైన 'థామా' సాంగ్ గురించి ఆమె వివరించారు. ఈ పాట రూపొందడం వెనక ఉన్న కథను వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇది దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. 'థామా' నుంచి ఇటీవల 'నువ్వు నా సొంతమా' అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో రష్మిక తన అందంతో, డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఆమె వెల్లడించారు. 
 
"మేము దాదాపు 12 రోజుల పాటు ఓ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ చేశాం. ఆ చివరిరోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. 'ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదు' అన్నారు. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. ఆ లొకేషన్ నాకు కూడా నచ్చింది. దీంతో 3-4 రోజుల్లో మేం రిహార్సిల్స్ చేసి పాటను షూట్ చేశాం. పాట అయ్యాక చూసి అందరం ఆశ్చర్యపోయాం. ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా" అని చెప్పారు. ఈ పాటకు సంబంధించిన స్టిల్స్‌ను ఆమె షేర్ చేశారు.