గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (11:01 IST)

ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న... నేడు ఫాదర్స్ డే

అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తుంది. తండ్రి మాత్రం ఆ బిడ్డకు జీవితాన్ని ప్రసాదిస్తాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిస్తుంటాడు. అలాంటి మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. 
 
బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. 
 
జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డల ఎదుగుదలను మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను ఏడాదిలో ఒక్కసారైనా గౌరవించడం మన బాధ్యత. అందుకే ఏటా జూన్ మూడో ఆదివారం రోజున 'ఫాదర్స్ డే'ను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 
 
ఫాదర్స్ డే స్పెషల్ కొటేషన్స్
నాన్న.. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.
నా మంచి, చెడు, ఆనందం, విజయం..
అన్నింటి వెనకా మీరే ఉన్నారు.
నా కోసం ఎంతో త్యాగం చేశారు.
పితృ దినోత్సవ శుభాకాంక్షలు నాన్నా..
 
మనలో జీవాన్ని నింపి,
అల్లారు ముద్దుగా పెంచి..
మనలోని లోపాలను సరిచేస్తూ,
మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ..
మనకు గమ్యం చూపేది.. 'నాన్న'.
అనురాగానికి రూపం 'నాన్న'
హ్యాపీ ఫాదర్స్ డే.