మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (09:56 IST)

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

Anupam Kher, Dulari Khair, Raju Khair, Falguni
Anupam Kher, Dulari Khair, Raju Khair, Falguni
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార ఛాప్టర్ 1 చిత్రం విడుదలై యూనివర్శల్ గా మంచి కలెక్లన్లతో రన్ అవుతుంది. మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 235 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టిందని చిత్ర టీమ్ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన తల్లి దులారీ ఖైర్, సోదరుడు రాజు ఖైర్, ఫల్గుణి, ఇతర సభ్యులతో ముంబైలో సినిమాను తిలకించారు. 
 
ఈ సందర్భంగా వీడియో షూట్ చేసి..  మై డియర్ రిషబ్ ఇప్పుడే సినిమా చూశాను. నా తల్లితో సహా అన్ బిలీవబుల్ సినిమా. మాటలు రావడంలేదు. మా తల్లి ఆశీస్సులు నీకూ వుంటాయి.. అంటూ తల్లిచేత ఆశీస్సులు అందించారు. దీనికి రిషబ్ శెట్టి స్పందిస్తూ, మీరు మరియు మీ కుటుంబం కాంతార ఛాప్టర్ 1 ని ప్రేమించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ దయగల మాటలు మాకు చాలా అర్థమవుతాయి.  మా హృదయాలు నిండిపోయాయి అంటూ పేర్కొన్నారు.