80s Reunion heroiens at chenai meet
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగే “80s Stars Reunion” అక్టోబర్ 4, 2025న చెన్నైలో జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత జరిగిన ఈ సమావేశం, అందరికీ అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ గా నిలిచింది.
80s Reunion heros and heroiens at chenai meet
గతేడాదే నిర్వహించాలనుకున్నా, చెన్నైలో జరిగిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ రీయూనియన్ వాయిదా పడింది. ఈసారి ఆ వేడుక స్నేహం, ఐక్యత, హృదయపూర్వకమైన సమావేశం విజయవంతంగా జరిగింది.
రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తమ ఇంట్లోనే ఈ రీయూనియన్‌ను ఆతిథ్యం ఇచ్చారు. లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భగ్యరాజ్, ఖుష్బూ సుందర్, సుహాసిని మణిరత్నం ఈ కార్యక్రమాన్ని కోఅర్దినేట్ చేశారు.
ఇంటి ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సమావేశం, ఆ తారల మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది.
మొత్తం 31 మంది నటులు ఈ రీయూనియన్‌లో పాల్గొన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు హిందీ పరిశ్రమ నుండి కూడా స్టార్స్ వచ్చారు. సాయంత్రం అంతా నవ్వులు, జ్ఞాపకాలు, అనుభవాలు పంచుకుంటూ ఆత్మీయంగా గడిచింది.
80s స్టార్స్ రీయూనియన్ గురించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
''80s స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది'
“ఈసారి ఇది ఉత్సవం కాదు,” అని సుహాసిని మణిరత్నం అన్నారు.
“ఇది సంవత్సరాలుగా పరిచయమైన స్నేహితుల కలయిక ఒకరికొకరు మద్దతుగా ఉండటానికి, కృతజ్ఞత తెలిపేందుకు,” అని లిస్సీ లక్ష్మి తెలిపారు.
ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది.
రీయూనియన్‌కి హాజరైన 31 మంది స్టార్స్: చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్. రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ, నదియా, రాధ. సుహాషిని. రమ్య కృష్ణన్, జయసుధ, సుమలత, రెహమాన్, ఖుష్బూ, భాగ్యరాజ్,
16 పూర్ణిమా భాగ్యరాజ్, లిస్సీ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరామ్, అశ్వతీ జయరామ్, సరిత, బాను చందర్, మీనా, లత, స్వప్న, జయశ్రీ