1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Chiranjeevi says he has found a villain suitable for his age!

Chiranjeevi : నా వయస్సుకు సరిపడా విలన్ దొరికాడన్న చిరంజీవి !

Megastar Chiranjeevi, Shine Tom Chacko
Megastar Chiranjeevi, Shine Tom Chacko
మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో నటిస్తున్నారు. నిన్ననే నయనతారతో మీసాల పిల్ల పాట గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇప్పటికే చిరంజీవిని ఘరానా మొగుడు టైంలోని బాడీ తరహాలో దర్శకుడు మార్చేశాడు. దీనికోసం చాలాసార్లు ఫొటో షూట్ చేసి ఫైనల్ అయ్యాక సెట్ పైకి వెళ్ళారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా ఎవరనేది బాగుంటుందని పలువురు పేర్లు అనుకున్న టైంలో నా వయస్సుకు తగిన విలన్ ను తీసుకోండని చిరు చలోక్తి విసిరినట్లు తెలిసింది.
 
తాజాగా  మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన విలన్‌గా చేరినట్లు తెలిసింది. తెరపై అద్భుతమైన పోటీ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ కొంత భాగం జరుపుకున్న ఈ సినిమాలో విలన్, హీరో మధ్య పెద్ద యాక్షన్ సీన్స్ కూడా ఎంటర్ టైన్ మెంట్ లో దర్శకుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో చాకో విలన్ గా రావడం చిత్రానికి మరింత ఉత్సాహాన్నిస్తుందని చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
About Writer
చిత్రాసేన్
తర్వాతి కథనం
Jana Nayagan: కరూర్ ఘటన: విజయ్ జన నాయగన్ పాట విడుదల వాయిదా