దారికిరాకుంటే వలంటీర్లను పీకిపారేయండి.. మంత్రి దాడిశెట్టి ఆదేశం
మన పార్టీ నేతల మాట వినకుంటే వలంటీర్లను పీకిపారేయాలని మంత్రి దాడిశెట్టి రాజా అధికారులను ఆదేశించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కరప మండలం నడకుదురులో మంగళవారం నిర్వహించిన కాకినాడ జిల్లా వైకాపా ప్లీనరీలో మంత్రి రాజా ఈ వ్యాఖ్యలు చేశారు.
'జెండా మోసిన కార్యకర్తలే శాశ్వతం. వారిదే వైకాపా. నాయకులది కాదు...' అని అన్నారు. వాలంటీర్ల రాకతో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉందని, మనం పెట్టిన వాలంటీర్లు పెత్తనం చేస్తున్నారని, మనమేమీ చేయలేకపోతున్నామంటూ పార్టీలోని నాయకులు అసంతృప్తికి గురవుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
వాలంటీర్లను మనమే పెట్టామని, కార్యకర్తలకు నచ్చకపోయినా, ఎవరైనా సరిగా పని చేయకపోయినా తీసేయండని సూచించారు. గ్రామ కార్యదర్శులను అదుపులో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు.