సంబంధిత వార్తలు
- ‘నాన్న మీరే నా హీరో’.. భావోద్వేగ పోస్టు పెట్టిన లాలూ కుమార్తె..!
- ప్రధాని మోడీ హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లు, తప్పించుకున్న ప్రధాని
- మోదీతో చిరు ముచ్చట..! భుజం తట్టి ఉద్వేగంతో మాట్లాడిన ప్రధాని (video) మోడీ
- నేడు భీమవరంలో ప్రధాని పర్యటన - రఘురామ పేరు లేదంటున్న డీజీపీ
- తెలంగాణాలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది : ప్రధాని మోడీ
అల్లూరి ఈవెంట్ హైలైట్స్‌ను షేర్ చేసిన ప్రధాని మోదీ (Video)
Modi
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో నిన్న చిరస్మరణీయంగా జరిగిన కార్యక్రమ ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు.
ఇకపోతే.. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ ఏపీలోని భీమవరంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లు హాజరయ్యారు.
Sharing highlights from yesterdays memorable programme in Bhimavaram, Andhra Pradesh in which we paid homage to the brave Alluri Sitarama Raju. pic.twitter.com/LADvNTL5p3
— Narendra Modi (@narendramodi) July 5, 2022
ఇక భీమవరం సమీపంలోని మొగల్తూరులో జన్మించిన టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో చిరు ట్వీట్ చేశారు.
మొత్తం నాలుగు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేసిన చిరంజీవి... అల్లూరి విగ్రహావిష్కరణకు కేంద్రం తనను ఆహ్వానించడం, ఆ కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఇక నాలుగు ఫొటోల్లో ఒకటి మోదీ తనను ఆత్మీయంగా పలకరిస్తున్న ఫొటో కాగా... మరొకటి జగన్ తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోగా ఉంది. మరో ఫొటోలో కూర్చున్న మోదీకి జగన్ చూస్తుండగా చిరు నమస్కరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకోవడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ కూడా ఆమెతో వున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
