గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (09:50 IST)

హైదరాబాద్‌లో వైకారా రెబెల్ ఎంపీ రఘురామపై కేసు నమోదు

raghurama krishnaraju
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై హైదరాబాద్ నగరంలో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తనను ఎంపీ, ఆయన నలుగురు అనుచరులు వచ్చి కారులో ఎక్కించుకుని రఘురామ ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వింగ్ కానిస్టేబుల్ షేక్ ఫరూఖ్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రఘురామపై కేసు నమోదు చేసినట్టు గచ్చిబౌలి పోలీసు ఇన్‌స్పెక్టర్ సురేశ్ వెల్లడించారు. ఈ కేసులో రఘురామతో పాటు ఆయన కుమారుు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుళ్ళను నిందితులుగా చేర్చినట్టు ఆయన తెలిపారు. 
 
ఇన్‌స్పెక్టర్ వెల్లడించిన వివరాల మేరకు ఈ నెల 3వ తేదీన రాత్రి గచ్చిబౌలిలోని రఘురామ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తచ్చాడుతుండటాన్ని ఆయన సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, తాను ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా గచ్చిబౌలిలో ఐఎస్‌బీ ఎదురుగా విధులు నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి తన గుర్తింపును ప్రశ్నిస్తూ దాడి చేశారని ఆయన తెలిపారు. ఆ తర్వాత కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లి ఓ విలాల్లో బంధించి కర్రలతో కొట్టారని దీంతో ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్, ఏఎస్‌ఐలపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.