మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (09:39 IST)

13 రైళ్లను మళ్లీ పట్టాలెక్కిస్తున్న దక్షిణ మధ్య రైల్వే

train
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వివిధ కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లలో 13 రైళ్లను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 13 డెమో రైళ్ళను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. 
 
వీటిలో విజయవాడ - గూడూరు, గూడూరు - విజయవాడ, నిజామాబాద్ - నాందేడ్, నాందేడ్ - విజయవాడ, తెనాలి - విజయవాడ, విజయవాడ - తెనాలి, కర్నూలు సిటీ - నంద్యాల, నంద్యాల - కర్నూలు సిటీ, గుంటూరు - విజయవాడ, విజయవాడ - గుంటూరు, విజయవాడ - ఒంగోలు, ఒంగోలు - విజయవాడల మధ్య నడిచే డెమో రైళ్ళను తిరిగి నడిపేందుకు చర్యలు తీసుకుంది.