మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (14:10 IST)

ఆంధ్రప్రదేశ్ పుణ్య భూమి - వీర భూమి - ప్రధానమంత్రి మోడీ

modi - jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పుణ్య భూమి, వీర భూమి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అందుకే ఈ భూమికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్య సాధనంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రతి ఒక్కరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 
 
వెస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాన మోడీ సోమవారం జిల్లాలోని పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. 'ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 
 
యావత్‌ భారతదేశం తరపున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక ఆయన. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌ త్యాగధనులకు నమస్కరిస్తున్నా. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను స్మరించుకుంటున్నాం. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. మనమంతా ఒకటే అన్న భావనతో ఉద్యమం జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు.