సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (11:52 IST)

ఏపీలో మంగళ - బుధవారాల్లో వర్షాలే వర్షాలు

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అలాగే, అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా బలమైన గాలులు వీస్తాయని, ఈ కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
బంగ్లాదేశ్‌లో పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయువ్యంగా పయనించి ఆదివారం దక్షిణ జార్ఖండ్ రాష్ట్ర పరిసరాల్లో కేంద్రీకృతమైవుంది. ఈ కారణంగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.