గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (22:49 IST)

భారతీయులపై పుతిన్ ప్రశంసల జల్లు.. వారు ప్రతిభావంతులు

putin
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతీయులపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్థత, విజయకాంక్ష కలవారన్నారు. 
 
రూ.100కోట్లకు పైబడిన జనాభా గల భారత దేశ సత్తా పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా భారత్ పాత్ర పెరుగుతుందన్నారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. 
 
"మనం భారత దేశాన్ని చూద్దాం. అంతర్గత అభివృద్ధి కోసం విజయకాంక్ష గల గొప్ప ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఆ దేశాభివృద్ధిలో కచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి" అని పుతిన్ చెప్పారు.