గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (12:03 IST)

దేశంలో తొలి ఓటరు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

shyam saran negi
దేశంలో తొలి ఓటరుగా గుర్తింపు పొందిన శ్యాణ్ శరణ్ నేగి ఇకలేరు. ఆయన 106 యేళ్ళ వయస్సులో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంచనాలతో పూర్తి చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఇటీవలే 34వ సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
106 యేళ్ల వయసులో కూడా నేగి ఓటు వేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానంగా ప్రస్తావించారు. నేగి ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ చేశారు. ఆధునిక యువతకు నేగి స్ఫూర్తి అంటూ ప్రధాని కొనియాడారు. 
 
మరోవైపు, నేగి మృతిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, నేగి స్వతంత్ర భారతదేశానికి 1951లో జరిగిన ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారని  ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పటివరకు జరిగిన జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34వ సారి నేగి ఓటుహక్కును వినియోగించుకుని దేశ యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు.