తెలుగు హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట విషాదం... తండ్రి మృతి
తెలుగు యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, తన కుమారుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఎదిగేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతగానో ఆయన ఎంతగానో కృషి చేశారు. ఒకానొక సందర్భంలో తన తండ్రిని సోషల్ మీడియాలో వేదికగా తన అభిమానులకు నెటిజన్లకు పరిచయం కూడా చేశారు. కానీ, అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు. కాగా, శ్యామ్ సిద్ధార్థ్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు.