బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

కాలిఫోర్నియాలో మళ్లీ రక్తసిక్తం.. దుండగుడు కాల్పుల్లో ఏడుగురి మృతి

gunshoot
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత వినిపిస్తూనే వుంది. తాజాగా లాస్ ఏంజెలెస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 11 మంది చనిపోయారు. ఈ దుర్ఘటన మరిచిపోకముందే అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత వినిపించింది. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు సహా మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. 
 
ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బేలోని రెండు ప్రాంతాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ ఫామ్ రైస్ టకింగ్ సోయిల్ ఫామ్‌లో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు 
 
మరోవైపు, డెస్ మెయిన్స్‌లోని ఓ పాఠశాలలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థుల చనిపోగా, ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, కాల్పులు జరిపిన 20 నిమిషాల్లోనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.