1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (14:53 IST)

రాజమౌళి చెవిలో సీక్రెట్‌ చెప్పిన జేమ్స్‌ కేమరూన్‌

James Cameron told the secret
James Cameron told the secret
హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌ ఓ సీక్రెట్‌ రాజమౌళి చెవిలో చెప్పాడు. అదేమిటంటే.. మీకో విషయం చెప్పాలి. మీరు కనుక ఇక్కడ సినిమాతీస్తే ఓ విషయం మాట్లాడాలి.. అంటూ చెవిలో చెప్పాడు జేమ్స్‌ కేమరూన్‌.  వివరాల్లోకి వెళితే, ఇటీవలే ఆర్‌.ఆర్‌.ఆర్‌. (రౌద్రం రణం రుదిరం) సినిమాకు గ్లోబ్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌ తో రాజమౌళి టీమ్‌ సంభాషించింది. 
 
James Cameron wife and rajamouli
James Cameron wife and rajamouli
జేమ్స్‌ కేమరూన్‌ మాట్లాడుతూ, ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో ప్రతి సన్నివేశాన్ని వివరించారు. ఆ పక్కనే వున్న ఆయన భార్య ఈ సినిమాను రెండు సార్లు చూశారంటూ చెప్పింది. ప్రతి సీన్‌ గురించి చెబుతున్నారు. నేను ఓసారి ఓ సీన్‌ గురించి అడిగితే.. ష్‌...ష్‌.. అంటూ నన్ను అడ్గుకుని ఆయన సినిమాను నిలుచుని చూశారంటూ.. యాక్షన్‌ చేసి చూపించింది. ఇదివిన్న వెంటనే రాజమౌళి, గుండెమీద చేయివేసుకుని మీలాంటివారు మా సినిమాను చూసి విశ్లేషిస్తుంటే అవార్డుకంటే గొప్పగా వుందంటూ స్పందించారు.
 
ఈ సినిమాను ఎన్నిరోజుల్లో తీశారనిజేమ్స్‌ కేమరూన్‌ అడగగానే, 320 డేస్‌ అంటూ బదులిచ్చారు. ఓ వెరీగుడ్‌ అంటూ ఆయన మాట్లాడడం విశేషం.  ఆ తర్వాత జేమ్స్‌ కేమరూన్‌, కీరవాణి సంగీతం గురించి మాట్లాడారు. ఫైనల్‌గా ఓ విషయం చెప్పాలంటూ.. జేమ్స్‌ కేమరూన్‌, రాజమౌళి కుడిచెవి దగ్గరకు వెళ్ళి.. ఇక్కడ మీరు సినిమా చేయాలంటే మనం మాట్లాడుకోవాలంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. అది ఏమిటి? అనేది తెలీదు. ఇంతవరకు ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్‌ పూర్తిగా కేమరూన్‌ తో మాట్లాడుతున్న క్లిప్‌ను ఈరోజు విడుదల చేసింది.