ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (14:13 IST)

తల్లిదండ్రులను 282 సార్లు కత్తితో పొడిచి చంపేసిన కిరాతకుడు

knife
తల్లిదండ్రులను ఓ కిరాతకుడైన కుమారుడు చంపేశాడు. అది కూడా అతికిరాతకంగా చంపాడు. ఏకంగా మూడు కత్తులతో 282 సార్లు పొడిచి వారి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జాన్, బెవర్లీ దంపతుల కుమారుడు డేవిడ్ ఓ సైకో. ఇతడి వయస్సు 37 సంవత్సరాలు. డేవిడ్ తన తల్లి, తండ్రిని 282 సార్లు కత్తులతో పొడిచి చంపేశాడు. ఇటీవల తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుడిపై కోర్టులో విచారణ జరిగింది. 
 
రక్తంతో తడిసిన రెండు మృతదేహాలు లోపల పడి వుండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. డేవిడ్ తన తల్లిదండ్రులను హత్య చేసినట్లు అంగీకరించాడు. 
 
డేవిడ్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. డేవిడ్ తల్లిదండ్రులకు దాడికి ఒక రోజు ముందు వైద్యుడిని కూడా కలిశాడు. 
 
తల్లిపై 90కి పైగా కత్తిపోట్లు, అదే సమయంలో తండ్రిపై 180 సార్లు దాడి జరిగింది. దీంతో అతడిని పోలీసుల విచారణ అనంతరం కోర్టు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.