గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (13:00 IST)

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం.. అమ్మమ్మ ఇకలేరు..

rashmi gautam
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రష్మీ గౌతమ్ బామ్మ ప్రాణాలు కోల్పోయారు. రష్మీ కుటుంబంలో ఈమె ముఖ్యమైన వ్యక్తి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా రష్మీ గౌతమ్ తెలియజేసింది. 
 
తన అమ్మమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మమ్మతో తన అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేసింది. మా కుటుంబం అంతా సమావేశమై మా అమ్మమ్మ ప్రమీలా మిశ్రగారికి చివరిసారిగా వీడ్కోలు పలికింది. 
 
ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ప్రభావం మాపై చాలా వుందని పేర్కొంది. ఆమె జ్ఞాపకాలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని.. ఓ శాంతి అంటూ పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్‌కు ధైర్యం చెప్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.