బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 21 జనవరి 2023 (18:52 IST)

కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జామ్స్‌ 2021-22లో భారతదేశం నుంచి అగ్రస్థానంలో నిలిచిన 48 మంది భారతీయులు

Arun Rajamani
కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేనల్‌ స్కూల్‌ , 222 ఔట్‌స్టాండింగ్‌ కేంబ్రిడ్జ్‌ లెర్నర్‌ అవార్డులను భారతీయ విద్యార్థులకు అందించింది. ఈ అంతర్జాతీయ అవార్డులతో 40 దేశాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను వేడుక చేశారు. వీరి అర్హతలను ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ యూనివర్శిటీలు, ఎంప్లాయర్లు గుర్తించగలరు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహిస్తున్న స్టడీ కోర్సులను అభ్యసిస్తున్నారు. దాదాపు 160 సంవత్సరాలుగా  ఇంటర్నేషనల్‌ ఎగ్జామ్స్‌ను కేంబ్రిడ్జ్‌ అందిస్తుంది.
 
మొత్తంమ్మీద భారతదేశం నుంచి 187 మంది విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన ఔట్‌స్టాండింగ్‌ కేంబ్రిడ్జ్‌ లెర్నర్‌ అవార్డులను 2021-22లో కేంబ్రిడ్జ్‌ పరీక్షలలో అసాధారణ ప్రదర్శన కనబరిచినందుకు అందించారు. ఈ అవార్డులు నాలుగు విభాగాలు, టాప్‌ ఇన్‌ వరల్డ్‌, టాప్‌ ఇన్‌ ద కంట్రీ, హై ఎచీవ్‌మెంట్‌ అవార్డు మరియు బెస్ట్‌ ఎక్రాస్‌లో అందిస్తున్నారు. భారతదేశం నుంచి 48 మంది విద్యార్థులు టాప్‌ ఇన్‌ ద వరల్డ్‌ అవార్డు గెలుచుకున్నారు. అంటే దీనర్థం ప్రపంచంలో అత్యధిక మార్కులను నిర్ధేశిత సబ్జెక్ట్‌లో సాధించారని. ఈ 48 మంది విజేతలలో, 22 మంది విద్యార్ధులు మేథమెటిక్స్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచారు. విభిన్న విభాగాలైనటువంటి కేంబ్రిడ్జ్‌ ఐజీసీఎస్‌ఈ, కేంబ్రిడ్జ్‌ ఓ లెవల్‌, కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఏఎస్‌ మరియు ఏఎల్‌ అండ్‌ ఏ లెవల్‌ అర్హతలు ఉన్నాయి.
 
కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ అండ్‌ ఎస్సెస్‌మెంట్‌ సౌత్‌ ఆసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ రాజమణి మాట్లాడుతూ, ‘‘ఈ ఔట్‌స్టాండింగ్‌ కేంబ్రిడ్జ్‌ లెర్నర్‌ అవార్డులు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంబ్రిడ్జ్‌ పరీక్షలలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన అసాధారణ విద్యా నిపుణులు సాధించిన విజయాలకు గుర్తించి వేడుక చేసే రీతిలో  ఉంటాయి.

ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యాసకులు స్టెమ్‌- నాన్‌ స్టెమ్‌ బోధనాంశాలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. 2022 సంవత్సరంలో 187 మంది విద్యార్థులు ప్రశంసలను పొందడం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఫలితాలు భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉందని ప్రతిబింబిస్తున్నాయి. అది కేవలం అభ్యాసకుల పరంగా మాత్రమే కాదు, ఉపాధ్యాయ వృత్తి పరంగా కూడా ఈ ప్రతిభ కనబడుతుంది. ఈ విజేతలను, వారి ఉపాధ్యాయులను, వీరికి నిరంతరం మద్దతు అందిస్తున్న వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. వీరి మద్దతు కారణంగానే ఈ యువ సాధకులు తమ మహోన్నత ప్రయాణంలో విజయం సాధించగలిగారు’’ అని అన్నారు.