గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (11:53 IST)

ఇంటర్ పూర్తిచేసిన తెలంగాణ విద్యార్థులకు సాఫ్ట్‌‍వేర్ ఉద్యోగం!

students
ఇంటర్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ హెచ్.సి.ఎల్. శుభవార్త చెప్పింది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఉద్యోగం కావాలనుకునే విద్యార్థులు ఇంటర్‌లో తప్పకుండా గణితం (మ్యాథ్స్) తీసుకుని ఉండాలన్న నిబంధన విధించింది. అలా మ్యాథ్స్ సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణులైన వారిలో నెలకు 20 వేల మందిని ఎంపిక చేయనున్నారు. 
 
60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు హెచ్.సి.ఎల్ కార్యాలయంలో ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ఉన్నసమయంలో నెలకు రూ.10 వేల చొప్పున ఉపకారవేతనం అందజేస్తారు. ఇది కూడా పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ ఆఫర్ ఇస్తారు. 
 
ఉద్యోగం జాయిన వారికి రూ.2.50 లక్షల మేరకు వార్షిక వేతనం అందజేస్తారు. అంటే నెలకు రూ.20 వేల చొప్పన జీతం ఇస్తారు. ఇక్కడో మరో సౌలభ్యం ఏమిటంటే ఈ ఉద్యోగం చేస్తూనే బిట్స్, ఎమిటీ వంటి యూనివర్శిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అనుభవం ఆధారంగా వేతనం కూడా పెంచుతారు.