ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (13:58 IST)

హైదరాబాద్‌లో అరుదైన పిల్లి కిడ్నాప్.. పోలీసులకు ఫిర్యాదు

cat
cat
హైదరాబాద్‌లో ఓ అరుదైన జాతి పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన జంతు ప్రేమికులను కలచివేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. తప్పిపోయిన పిల్లి ఖౌ మనీ జాతికి చెందినది. ఇది నీలం, ఆకుపచ్చ రంగు కన్నును కలిగి ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఈ 18 నెలల పెంపుడు పిల్లి కిడ్నాప్‌కు గురైందని.. దాని యజమాని మహ్మద్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ పిల్లిని అతను రూ. 50వేలకు కొనుగోలు చేశాడు. 
 
ఈ  ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి పిల్లిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అతనిని పట్టుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు.