శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (11:23 IST)

మహిళలే దర్శకనిర్మాతలుగా ఆర్యాన్ గౌర హీరోగా ఓ సాథియా

Aryan Goura, Misty Chakraborty
Aryan Goura, Misty Chakraborty
సరికొత్త ప్రేమకథతో ఆర్యాన్ గౌర చేస్తున్న ఓ సాథియా ఓ సాథియా అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.
 
జీ జాంబి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆర్యాన్ గౌర. ఓ వైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆర్యాన్ గౌర మొదటి సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా ఓ సాథియా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఆర్యాన్ గౌరకు జోడిగా మిస్తీ చక్రవర్తి నటించారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలోకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్లు ప్రకటించారు. ఇప్పటికే ఓ సాథియా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ సోషల్ మీడియాలో ఎంతగానో ఆదరణను దక్కించుకుంది.
 
ఓ సాథియా నుంచి విడుదల చేసిన టైటిల్ సాంగ్, వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వెళ్లిపోయే పాటలకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్లతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది.
 
ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. విన్ను సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌నుమేకర్స్ ప్రకటించనున్నారు .