బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (16:51 IST)

మహిళలు రూపొందిస్తున్న ఓ సాథియా మోషన్ పోస్టర్‌ విడుదల

Vijayendra Prasad and O Sathiya team
Vijayendra Prasad and O Sathiya team
ఓ సినిమాకు దర్శకురాలు, నిర్మాత మహిళలు కావడం విశేషం. అలా మహిళలిద్దరూ కలిసి తీసిన చిత్రమే ఓ సాథియా. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రం చేశారు.
 
కాగా,  రాజ్య సభ సభ్యుడు, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించింది.  ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ప్రస్తుతం యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు విన్ను అందించిన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది. ఓ సాథియా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ తాజాగా ఈ సినిమా నుంచి రెండో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.