నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది - అల్లూరి హీరో శ్రీవిష్ణు
Alluri Success cake cutting
'అల్లూరి' అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో కుదరలేదు. దానికి ప్రేక్షకులకు క్షమాపణలు. సీనియర్స్ పోలీస్ ఆఫీసర్ కథని ఒక బయోపిక్ లా కీలకమైన సంఘటనలతో ప్రజంట్ చేశాం. ప్రేక్షకుల నుండి కూడా అంతే సిన్సియర్స్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది అని కథానాయకుడు శ్రీవిష్ణు అన్నారు.
ఆయన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. యాక్షన్ సీన్స్ కి విజల్స్ వేస్తున్నారు. నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ కి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు పేరుపేరునా కృతజ్ఞతలు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పినట్లే చాలా సీనియర్స్ గా సినిమాని ప్రజంట్ చేశారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు నన్ను ప్రేమ ఇష్క్ కాదల్ తో పరిచయం చేశారు. ఆయనతో జర్నీ చాలా బావుంటుంది. చాలా మంచి మనిషి. ఈ సినిమా చూసిన వాళ్ళు మీ అనుభవాన్ని స్నేహితులకి చెప్పండి. మీడియా, వంశీ-శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాని చూడని వాళ్ళు వెంటనే చూడండి. ఈ సినిమాని అందరూ ఆదరించి ఇంకా పెద్ద సినిమా చేయాలి'' అని కోరారు.
ప్రదీప్ వర్మ మాట్లాడుతూ.. నేను అనుకున్న కథ రాశాను, డైరెక్ట్ చేశాను, రిలీజ్ చేశాం. నా కల నెరవేరింది. నేను విజయసాధించాననే ఆనందం వుంది. శ్రీవిష్ణు అద్భుతంగా చేశారు. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని చేశారు. విజువల్స్ ఇంత రిచ్ గా ఉండటానికి కారణం నిర్మాత ఇచ్చిన సపోర్ట్. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామకృష్ణ బ్రిలియంట్ గా యాక్షన్ డిజైన్ చేశారు. మిగతా సాంకేతిక నిపుణులు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. నా డైరెక్షన్ టీంకి కృతజ్ఞతలు. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా బావుందని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ పని మీడియా మాత్రమే చేయగలదు. దయచేసి మీడియా సినిమాని మరింత జనాల్లోకి తీసుకెళ్ళాలి'' అని కోరారు
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. .. 'అల్లూరి' నిన్న మాట్నీ షో నుండి అన్ని చోట్ల రిలీజ్ అయ్యింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో పడలేదు. మాట్నీ షో నుండి క్రమంగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరూ స్ఫూర్తిని ఇచ్చే చిత్రమని అభినందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసు. ఈ సినిమాతో మరోసారి నిరూపిస్తారని కోరుతున్నాను. ఫ్యామిలీ తో కలసి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. శ్రీవిష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే దర్శకుడు ప్రదీప్ వర్మ చాలా చక్కగా తీశారు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ అందించారు. మిగతా సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మంచి సినిమా తీశాం. మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని మరింతగా ప్రేక్షకులు ఆదరించాలి'' అని కోరారు.
ఈ సక్సెస్ మీట్ లో డీవోపీ రాజ్ తోట, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ట్ డైరెక్టర్ విఠల్, ఫైట్ మాష్టర్ రామ్ క్రిషన్, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల తదితరులు పాల్గొని సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.