శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (18:40 IST)

మహేష్ బాబు తర్వాత శ్రీవిష్ణు ఆ కోవకి వస్తారు - అల్లూరి ట్రైలర్ ఆవిష్క‌ర‌ణ‌లో నాని

Sree Vishnu, Nani, Bekkem Venugopal
Sree Vishnu, Nani, Bekkem Venugopal
హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు.
 
ట్రైల‌ర్ ఎలా వుందంటే
తనికెళ్ల భరణి ఒక యువకుడి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైయింది. ఆ తర్వాత శ్రీవిష్ణు నేరస్తులను అదుపు చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ స్టయిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా పరిచమయ్యారు. కేసులను డీల్ చేయడానికి వేరే మార్గం లేనప్పుడు అతను వైలెంట్ గా మారుతాడు. నక్సలైట్లు, నేరస్తుల్లో మార్పు తీసుకువస్తాడు. కానీ అతను అధిగమించడానికి ఇంకా పెద్ద అడ్డంకులు వుంటాయి. పోలీస్ ఉద్యోగం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు
 
అల్లూరి స్పూర్తిదాయకమైన ప్రయాణం ట్రైలర్ లో బ్రిలియంట్ గా ప్రజంట్ చేశారు. శ్రీవిష్ణు అద్భుతమైన నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శ్రీవిష్ణు భార్యగా కయదు లోహర్ తన పాత్రను చక్కగా పోషించింది.
 
ప్రదీప్ వర్మ తన రైటింగ్, టేకింగ్‌తో మంచి ఇంప్రెషన్‌ని కలిగించాడు. రాజ్ తోట కెమెరా పనితనం చక్కగా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం పవర్ ఫుల్ గా వుంది. అల్లూరి గ్రిప్పింగ్ పోలీస్ డ్రామాగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
 
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..  అల్లూరి ట్రైలర్ చాలా బావుంది. ఈ మధ్య కాలంలో ఎనర్జిటిక్ ఫిలిమ్స్  ప్రేక్షకులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అల్లూరి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది వుంటారు. అలాంటి నటుల్లో ముందు వరుసలో వుండే హీరో శ్రీవిష్ణు. అందుకే శ్రీవిష్ణు అంటే నాకు చాలా ఇష్టం. శ్రీవిష్ణు కథల ఎంపిక చాలా బావుంటుంది. విష్ణు రియల్ లైఫ్ లో చాలా పెద్ద ఎంటర్ టైనర్. పర్శనల్ గా కలుస్తున్నపుడు శ్రీవిష్ణు విశ్వరూపం చూశాను. విష్ణులో ఆ ఎంటర్ టైనర్ కోణం కూడా బయటికి రావాలని కోరుకుంటాను. అది మీ అందరికీ నచ్చుతుంది. బయట చాలా రిజర్వడ్ గా వుండి లోపల చాలా సరదాగా ఉంటారని మహేష్ బాబు గారి గురించి విన్నాను. మహేష్ బాబు గారి తర్వాత శ్రీవిష్ణు ఆ కోవకి వస్తారు. శ్రీవిష్ణు కూడా అంత పెద్ద స్టార్ అయిపోవాలి. ఇప్పటికే మంచి నటుడనే పేరు వచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటాను తెలిపారు.
 
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ప్రదీప్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఇలాంటి గొప్ప కథ ఎలాగైనా ప్రేక్షకులకు చెప్పాలని అనుకున్నాం. బెగ్గం వేణుగోపాల్ ఈ నిజాయితీ గల కథని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని గారు రావడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నాని గారంటే నాకు చాలా ఇష్టం. నాకు నాని గారు స్ఫూర్తి. ఎంతోమంది నానిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీ వస్తారు. చాలా మంది దర్శకులకు నాని గారితో పని చేయాలని వుంటుంది. అల్లూరి సినిమాకి పని చేసిన అందరూ చాలా వండర్ ఫుల్ వర్క్ ఇచ్చారు. అల్లూరి చాలా నిజాయితీ గల గొప్ప సినిమా. సెప్టెంబర్ 23న అందరూ థియేటర్ కి మ్మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను''
 
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. నాని గారితో తీసిన నేను లోకల్ సినిమా గొప్ప జ్ఞాపకం. ఆయన ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. అల్లూరి అద్భుతమైన కంటెంట్ వున్నా సినిమా. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా ఇంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది. మా హీరో శ్రీవిష్ణు గారితో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి  కృతజ్ఞతలు. సెప్టెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి'' అన్నారు.
 
గేయ రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. అల్లూరి అంటే పవర్. పోలీస్ అంటే పవర్.. మరో పవర్ శ్రీవిష్ణు. ఈ మూడు పవర్స్ ని కలిపి పవర్ ఫుల్ సినిమా తీశారు ప్రదీప్ వర్మ. ఈ సినిమాలో అన్ని పాటలు రాశాను. వజ్రాయుధం పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బెక్కం వేణుగోపాల్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. అల్లూరి పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు
 
సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
 
ఈ చిత్రానికి ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.  
 
అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు.