బట్టల షాపులో సేల్స్ మెన్స్‌గా రామ్‌చరణ్, రష్మిక మండన్న
హీరో రామ్‌చరణ్ చీరలు అమ్ముతూ సేల్స్‌మెన్‌గా అవతారం ఎత్తాడు. చీరలతోపాటు నగలను కూడా కొనుక్కోమని కస్టమర్లకు చూపుతున్నాడు. మరో సేల్స్ ఉమెన్ రష్మిక మందన్న కొనేవాళ్ళను లోపలికి ఆహ్వానిస్తూ అరె వెరైటీ చీరలు.. రండమ్మా అంటూ లోపలికి పంపుతుంది. మరోవైపు క్రికెటర్ ప్లేయర్‌కూడా ఇలాగే ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియోకు మంచి గిరాకీ వుంది.
రామ్‌చరణ్ వాణిజ్యప్రకటన చేశారు. `మీషో` అనే యాప్ ద్వారా ఫోన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం వుండేలా కొత్త ప్రకటనలో నటించాడు. ఈ వీడియోలో సారాంశం ఏమంటే, రామ్‌చరణ్.. రండి విచ్చేయండి. సమస్కారం మార్కెట్లో రారాజు.. రండి మేడం రండి.. స్వాగతం అంటూ బట్టల షోరూం బయట కస్టమర్లను పిలుస్తుంటాడు. అదే రూటులో రష్మిక.. అరె.. వెరైటీలే వెరైటీలు. ఛాలెంజ్.. తక్కువ దరకు సేల్ అంటోంది. క్రికెట్ ప్లేయర్ అయితే... దీనిపైనా డిస్కౌంట్, దానిపైనా డిస్కైంట్ అంటూ స్వాగతం అంటూ పిలుస్తుంటాడు.. వెంటనే రామ్‌చరణ్ వచ్చి, మీషో. మెగా బ్లాక్ బస్టర్.. ఈనెల 23 నుంచి 27వరకు అతి తక్కువ ధరకు మాత్రమే.. అంటూ ముగింపు ఇస్తాడు. వినూత్నంగా వున్న ఈ వ్యాపార ప్రకటన ఎంటర్‌టైన్ చేసేదిగా వుందంటూ నెటిజన్లు సెలవిస్తున్నారు.