శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (06:49 IST)

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాల‌కృష్ణ శుభాకాంక్షలు

Balakrishna wishes Pawan Kalyan
Balakrishna wishes Pawan Kalyan
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాల‌కృష్ణకి నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈరోజు శుక్ర‌వారంనాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు అందుకే తెల్ల‌వారిజామున బాల‌కృష్ణ ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. త‌న అభిమానుల తరుపున ప‌వ‌న్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. తామిద్ద‌రూ వున్న ఫొటోను కూడా  షేర్ చేశారు.
 
కాగా,  ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజున ఆయ‌న న‌టించిన త‌మ్ముడు, ఖుషి చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఉద‌యంపూట థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయా ధియేట‌ర్ల‌లో ఆక్యుపై అయిపోయాయి. పెద్ద క‌టౌట్లు క‌ట్టి పూల‌మాల‌లువేసి అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. వీటిద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని సామాజిక సేవ‌కు ఉప‌యోగిస్తున్న‌ట్లు అభిమానులు తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌లే మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజున పోకిరి సినిమాను ప్ర‌ద‌ర్శించి వ‌చ్చిన సొమ్ములో కొంత భాగాన్ని హృద్రోగుల‌కు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.