గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:14 IST)

పవన్ కల్యాణ్ స్టైల్ అంటే భలే ఇష్టం.. ఇర్ఫాన్ పఠాన్‌

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కోబ్రా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మియా జార్జ్ కీలక పాత్రల్లో నటించారు.
 
ఎస్ఎస్ లలిత్ కుమార్‌ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
 
ఈ సినిమాలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కీ రోల్ పోషించాడు. ఇర్ఫాన్ పఠాన్‌కు ఇది తొలి సినిమా. కోబ్రా విడుదల సందర్భంగా ఇర్ఫాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయం పవన్ కల్యాణ్ అభిమానులను ఖుషీ చేస్తోంది.
 
ఇంతకీ విషయం ఏంటంటే సినిమాల్లో ఎవరినీ ఎక్కువ ఇష్టపడతారని ప్రశ్నించగా.. పలు సినీ సెలబ్రిటీల పేర్లు చెప్పాడు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. అంతేకాదు పుష్ప సినిమాలో అదిరిపోయేలా నటించిన అల్లు అర్జున్‌కు ఇంప్రెస్ అయిపోయానన్నాడు. తాను దక్షిణాది సినిమాలు చూస్తానన్నాడు.