ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:31 IST)

పవన్ కల్యాణ్ మేనియా.. తమ్ముడు, జల్సా రిలీజ్-ట్రెండింగ్‌లో పవర్ స్టార్ (video)

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు చేసుకునేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా పవన్ నటించి హిట్ అయిన సినిమాలు కూడా మళ్లీ థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. 
 
ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు పోకిరి కూడా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని మళ్లీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే కోవలో పవన్ సినిమాలు బిగ్ స్క్రీన్‌పై మళ్లీ కనిపించనున్నాయి. పవన్ కెరీర్‌లోని సూపర్ హిట్స్‌లో ఒకటిగా చెప్పుకునే సినిమా తమ్ముడు. ఈ సినిమా సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డేను పురస్కరించుకుని ఆగస్టు 31న పలు థియేటర్లలో విడుదలైంది. 
Tammudu
Tammudu
 
తెలుగు రాష్ట్రాల్లోని మల్టీ ఫ్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. థియేటర్ల వద్ద పవ్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. సినిమా హాళ్ల వద్ద కటౌట్లు ఏర్పాటు చేసి జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు. 
 
ఇక సెప్టెంబర్ 1 అంటే గురువారం పవన్ మరో సూపర్ హిట్ ఫిలిం జల్సాని విడుదల చేశారు. ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 501 కంటే ఎక్కువ షోలు వేస్తున్నారు. 
Jalsa
Jalsa
 
ఈ షోలకు ఫ్యాన్స్‌తో థియేటర్లు నిండిపోతున్నాయి. ఇక తమ్ముడు, జల్సా రీ-రిలీజ్‌లను పురస్కరించుకుని సోషల్ మీడియాలో పవన్ పేరు ట్రెండింగ్‌లో పరుగులు పెడుతోంది. పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.