శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (17:23 IST)

నా చుట్టూ ఉన్నవారి సంతోషమే నా సంతోషం- వైష్ణవ్ తేజ్

Vaishnav Tej
Vaishnav Tej
ఉప్పెన, కొండ పొలం త‌ర్వాత పంజా వైష్ణవ్ తేజ్ న‌టించిన సినిమా రంగ రంగ వైభవంగా. శుక్ర‌వారంనాడు విడుద‌ల‌కానున్న ఈ సినిమా గురించి వైష్ణవ్ తేజ్ ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. 'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మతో కలిసి పని చేయడం చాలా స‌ర‌దాగా వుంద‌ని తెలిపారు. 
 
- నేను ఫలితాలను లెక్కించి ప్రాజెక్ట్‌లను చేపట్టను. నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటే, అది నాకు సంతోషాన్నిస్తుంది. నా చుట్టూ పండుగ వాతావరణంలో జీవించడమే నాకు ఆనందం. నేను అహంభావి కాదు. మా కుటుంబంలో అందరం కలిసి సంతోషంగా జీవిస్తాం.
 
- నేను స్క్రిప్ట్ విన్నప్పుడు, కుటుంబ ప్రేక్షకులు చూసి ఆనందిస్తారని నాకు అనిపించింది.  అందులోని భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యాను. ఇది రొమాన్స్, కామెడీ మరియు భావోద్వేగాలతో నిండిన వినోదాత్మక కుటుంబ చిత్రం.
 
-  ఎవర్‌గ్రీన్ సినిమా అయిన ఖుషి  (2001)ని దీనికి పోలిక‌లేదు. పవన్ క‌ళ్యాణ్‌గారి పుట్టినరోజున  సినిమా విడుదల కావడం కూడా యాదృచ్ఛికమే.
 
- గిరీశయ్య వర్ధమాన దర్శకుడు. నేను చాలా స్క్రిప్ట్‌లు వింటున్నాను, కానీ అతని స్క్రిప్ట్ ఫ్రెష్‌గా అనిపించి దానిని తీయాలనిపించింది. తను చాలా నమ్మకంతో కథను చెప్పాడు. 
 
- నరేష్‌గారు, ప్రభుగారు, తులసిగారు, నవీన్‌చంద్ర వంటి సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం.
 
-ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌గారిని సహజంగానే అనుకరించాను. ఒక సన్నివేశంలో నేను సిగ్గుపడాలి. ఆ సంద‌ర్భంలో నేను అలా చేశాను.
 
- నా కళ్ల గురించి చాలా మంది మాట్లాడుకోవడం నిజం. ఇది ఒక ర‌కంగా ప్లస్ అని చెప్ప‌గ‌ల‌ను.
 
- మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా అన్న (సాయి ధరమ్ తేజ్) ఎమోషనల్ అయ్యాడు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నన్ను చిన్నవాడిగా చూసుకుంటారు. నటన విషయంలో నేను నా స్వంత నిర్ణయాలు తీసుకుంటాను.
 
- నా సినిమాల రిజల్ట్ వచ్చిన తర్వాత కచ్చితంగా విశ్లేషిస్తాను. నేను ఫీడ్‌బ్యాక్ చదువుతాను కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను.  
 
- కొత్త సినిమాలప‌రంగా చెప్పాలంటే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.