శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (19:18 IST)

జనసేనాని బర్త్‌డే స్పెషల్ - "మనల్ని ఎవడ్రా ఆపేది..." (Video Song)

pawan kalyan
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని జనసైనికులు ఒక ప్రత్యేక గీతాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తమ ఆరాధ్య హీరో, నేత కోసం ఫ్యాన్సే ఈ గీతాన్ని రూపొందించడం గమనార్హం. 
 
"మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గతంలో స్టేజీలపై పలికిన మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగును ఈ పాటలో ప్రముఖంగా ఉపయోగించారు. ఈ పాటను గురువారం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ పాటకు పవన్ అభిమానులు, జనసైనికుల నుంచి విశేష స్పందన రావడం గమనార్హం.