మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (18:38 IST)

మహిళతో రాసలీలలు.. నగ్నంగా వున్న కానిస్టేబుల్‌కు దేహశుద్ధి

పోలీస్ కానిస్టేబులే.. ఒక మహిళతో రాసలీలలు చేస్తూ ప్రజలకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ భాస్కర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆమె వెనుక పడకుండా ఉండలేడు. ఇటీవలే ఒక మహిళ భర్తను వేధించిన కేసులో ఉదయ్ భాస్కర్ పేరు మారుమ్రోగిపోయింది. 
 
అంత జరిగినా బుద్ధి రాణి ఉదయ్ భాస్కర్ తాజాగా ఒక మహిళతో రాసలీలలు నడుపుతూ గ్రామస్థులకు అడ్డంగా దొరికిపోయాడు. పట్టపగలు ఒక వివాహిత ఇంట్లో దూరి ఆమెతో సరససల్లాపాల్లో మునిగితేలాడు. దీన్ని గమనించిన గ్రామస్థులు అతడిని అడ్డంగా పట్టుకున్నారు. 
 
నగ్నంగా ఉన్న అతడిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. ఇక వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు.  సదురు కానిస్టేబుల్ పరుగు లంకించుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.