ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:31 IST)

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం యోగీ ఓఎస్డీ దుర్మరణం

OSD
OSD
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) మోతీలాల్ సింగ్‌ దుర్మరణం పాలయ్యారు. మోతీలాల్ తన భార్య, డ్రైవర్‌తో కలిసి జాతీయ రహదారి 28పై కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో ఓఎస్డీ మోతీలాల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్యను చికిత్స నిమిత్తం ఘోరక్‌పూర్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.