సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న సోనియా గాంధీ

sonia gandhi
గత కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతూ వస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మెరుగైన వైద్య సేవల కోసం విదేశాలకు వెళ్లనన్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాలు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. 
 
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పలువురు కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. వీరిలో ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ వంటి వారు ఉన్నారు. ఈ తరుణంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లాని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. కాగా, సోనియా గాంధీ ఇప్పటికే రెండుసార్లు కరోనా వైరస్ బారినపడ్డారు. అంతకుముందు ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విదేశాలకు వెళ్ళి చికిత్స కూడా చేయించుకున్నారు.