నంద్యాలలో చిరుత పులి.. పది రోజులుగా భయం భయం
నంద్యాలలో చిరుత పులి కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లాలోని గడివేముల మండలం ఒండుట్ల, గని గ్రామాల మధ్య చిరుత పులి సంచరిస్తున్నట్లు కాలి అడుగుల జాడను బట్టి గుర్తించడం జరిగింది. తురికొనికుంట వద్ద పత్తి పొలంలో పులి తిరుగుతోందని అటవీ శాఖాధికారులు తెలిపారు.
స్థానికుల సమాచారం ప్రకారం అటవీశాఖ అధికారులు పరిసరాలను పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించారు. పది రోజులుగా గ్రామస్తులను చిరుత భయభ్రాంతుకు గురిచేస్తోంది. గ్రామస్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.