గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (09:43 IST)

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత..

Leopard
తిరుమలలో చిరుత పులుల సంచారం గురించి తెలిసిందే. తాజాగా తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గతేడాది కూడా ఓ చిరుత ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ప్రవేశించి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. తాజాగా చిరుత క్యాంపస్‌లో తిరగడం గమనించిన వర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు.  
 
వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఆవరణలో చిరుత సంచరించినట్టు అధికారులు తెలిపారు. వర్సిటీ ఆవరణలో తిరుగుతున్న కుక్కలను చంపేందుకు చిరుత ప్రయత్నించిందని వెల్లడించారు. ఇంకా కుక్కలపై చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలు వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని వర్సిటీ అధికారులు తెలిపారు.