సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (11:47 IST)

ఏపీలో కానిస్టేబుల్ దారుణహత్య: కిడ్నాప్ చేసి కత్తితో పొడిచి చంపేశారు..

crime scene
ఏపీలో కానిస్టేబుల్ దారుణహత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కేంద్రం.. పట్టణ శివారులో ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి అతను ఇంటికెళ్లే సమయంలో దారికాచి మరీ దారుణుంగా కత్తులతో నరికి చంపినట్టు తెలుస్తోంది.
 
కాగా మృతుడిపేరు సురేంద్రగా తెలుస్తోంది. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్రను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు. అక్కడ నుంచి పట్టణ శివారులోని చెరువుకట్ట ప్రాంతానికి తీసుకొని వెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు.
 
ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన హత్య ఉదాంతంతో పోలీస్ శాఖ ఉలికిపాటుకు గురైంది. విషయం తెలిసిన వెంటనే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.