గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (10:45 IST)

ఆగస్ట్ 16, 1947లో ఏమి జరిగిందో చెప్పబోతున్న ఏఆర్ మురుగదాస్

August 16, 1947 poster
August 16, 1947 poster
మన దేశ స్వాతంత్ర్యం గురించి ఇప్పటి వరకు ఎవరు చెప్పని షాకింగ్  కథతో ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్ 'ఆగస్ట్ 16, 1947' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా పర్పుల్ బుల్ ఎంటర్టైన్మెంట్స్, ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సీరామ్ చౌదరి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.
 
ఏప్రిల్ 7న 'ఆగస్ట్ 16, 1947' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు ఈ రోజు నిర్మాతలు వెల్లడించారు. తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను స్వాతంత్రం వచ్చిన సమయానికి ఈ సినిమా తీసుకు వెళ్తుందని, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నిర్మాతలు చెప్పారు.