Refresh

This website telugu.webdunia.com/article/telugu-cinema-news/mangli-was-mesmerized-by-the-song-o-dollar-pilaga-from-das-ka-dhamki-123030800002_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

శనివారం, 4 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (10:05 IST)

దాస్ కా ధమ్కీ నుంచి ఓ డాలర్ పిలగా పాటతో మెస్మరైజ్ చేసిన మంగ్లీ

dolor song
dolor song
హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత  నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది.
 
ఇప్పటివరకూ విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల,  మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ డాలరు పిలగా’ పాటని విడుదల చేశారు మేకర్స్,
 
లియోన్ జేమ్స్ ఈ పాటని పెప్పీ పబ్ నెంబర్ గా క్యాచిగా కంపోజ్ చేశారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు సింగర్  మంగ్లీ. ఈ పాటలో విశ్వక్ లుక్స్ స్టన్నింగా వున్నాయి. రావు రామేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా ఈ పాటలో సందడి చేశారు.
 
వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.