సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (09:57 IST)

అమెరికాలో చెర్రీ-ఉపాసన బేబీమూన్.. ఫోటోలు వైరల్

Rancharan
Rancharan
అమెరికాలో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేస్తోంది. ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలో ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమెతో కలిసి అమెరికాను చుట్టేస్తున్నాడు.
 
ఇందుకు సంబంధించిన బేబీమూన్ ట్రిప్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చరణ్ కాస్తంత తీరిక సమయంలో భార్యను బయటకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. 
 
ఇక, ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఐదు హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డులను గెలుచుకుంది. 
 
అలాగే, ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ సాంగ్‌కు అవార్డు ఖాయమని చెబుతున్నారు.