యు.ఎస్.ఎ. బయలుదేరిం ఎన్.టి.ఆర్., గుడ్ మార్నింగ్ అమెరికాలో కాంట్రవర్సీ గురించి ఏమి చెపుతాడో!
ఆర్.ఆర్.ఆర్. సినిమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు హాలీవుడ్ క్రిటిక్స్ నుంచి తీసుకున్న రామ్‌చరణ్ కు సర్వత్రా హర్షం వెలిబుచ్చారు. అయితే ఈ అవార్డు ఎన్.టి.ఆర్.కు రాలేదనీ, పిలవలేదని విమర్శలు సోషల్ మీడియాలో తెగ పచార్లు చేశాయి. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.తో సినిమా తీసే యువ సుధ ఆర్ట్స్ ఎన్.టి.ఆర్. యు.ఎస్.ఎ. వెళ్ళనున్నారంటూ పోస్ట్ కూడా చేసింది. ఎన్.టి.ఆర్.ను ఆహ్వానిస్తున్నట్లు ఆ తర్వాత అవార్డు కమిటీనుంచి ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదలచేసింది.
ఆహ్వానం అందుకున్న ఎన్.టి.ఆర్. ఈరోజు తెల్లవారుజామున యు.ఎస్.ఎ.కు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. మాన్ ఆఫ్ మాస్ ఎన్.టి.ఆర్. ఆస్కార్ అవార్డుకోసం యు.ఎస్.ఎ. బయలుదేరి వెళ్ళారు అంటూ పోస్ట్ చేసింది. యు.ఎస్.ఎ.లో ఎన్.టి.ఆర్.కు అవార్డు కమిటీ ఓ అవార్డు ఇవ్వనుంది. ఇక ఆ తర్వాత నాటు నాటు సాంగ్‌ను చరణ్, ఎన్.టి.ఆర్. పెర్‌ఫార్మ్ చేయనున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, కాలభైవర తోపాటు కొందరు అక్కడే వున్నారు. ఈసారి ఎన్.టి.ఆర్.ను గుడ్ మార్నింగ్ అమెరికా కూడా ఆహ్వానించింది. మరి అక్కడ ఇండియాలో జరిగిన కాంట్రవర్సీ గురించి అడిగితే ఏం చెబుతారో చూడాలి.