ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (11:40 IST)

యు.ఎస్‌.ఎ.లో అందాలు ఆస్వాదిస్తున్న ఎన్‌.టి.ఆర్‌.

ntr us
ntr us
మ్యాన్‌ ఆఫ్‌ ది మాస్‌ ఎన్‌.టి.ఆర్‌. నిన్ననే యు.ఎస్‌. వెళ్ళారు. అక్కడ స్టార్‌ హోటల్‌లో బస చేశారు. బాల్కనీనుంచి బెవర్లీ హిల్స్‌లోని అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వారంరోజులపాటు ఆయన అక్కడ వుండనున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు పలు అవార్డులు  వచ్చిన సందర్భంగా ఎన్‌.టి.ఆర్‌.కూ హాలీవుడ్‌ క్రిటిక్‌ అవార్డు మ్యాన్‌ ఆఫ్‌ ది మాస్‌ పేరుతో ఇవ్వనున్నారు. 
 
ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ తదితరులు అక్కడే వున్నారు. వారితో కలిసి మార్చి 12న ఆస్కార్‌ అవార్డు ప్రకటన విడుదల చేసేవరకు వుండనున్నారు. ఆస్కార్‌ అవార్డు ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు దక్కాలని ఇప్పటికే వారి కుటుంబసభ్యులతోపాటు అభిమానులుకూడా పూజలు చేస్తున్నారు. తెలుగులో ఇంతవరకు రాని అవార్డు ఈ సినిమాకు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది.