1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (22:04 IST)

జూనియర్ "ఎన్టీఆర్ 30"లో హీరోయిన్‌గా జూనియర్ శ్రీదేవి (video)

jhanvi kapoor
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇది ఎన్టీఆర్ నటించే 30వ చిత్రం. అందుకే దీనికి "ఎన్టీఆర్ 30" అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. వెండితెర అతిలోకసుందరి దివంగత శ్రీదేవి ముద్దుల కుమార్తె, జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ పేరును ఖరారు చేశారు. 
 
ఈ విషయాన్ని ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం అధికారికంగా ఒక పోస్టరు ద్వారా బహిర్గతం చేశారు. ఈ చిత్రాన్ని తన సోదరుడైన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సకూర్చనుండగా, రత్నవేల్ ఛాయాగ్రహణం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.