మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (12:47 IST)

విరబూసిన విరజాజి వనంలా జూనియర్ శ్రీదేవి అందాలు

jhanvi kapoor
బాలీవుడ్ బ్యూటీగా గుర్తింపు పొందిన జూనియర్ శ్రీదేవి (దివంగత నటి శ్రీదేవి కుమార్తె) తాజాగా క్యూట్ లుక్‌లో అదరగొడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ స్టిల్‌ను పోస్ట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలావుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులు ఉండగా, వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభమయ్యే ప్రాజెక్టు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
jhanvi kapoor
 
ఇదిలావుంటే, ఆమె తాజాగా పోస్ట్ చేసి లుక్ కుర్రకారు కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. క్రీమ్ కలర్ డ్రెస్‌లో జాన్వీ అందాల జలపాతంలా, విరబూసిన విరజాజి వనంలా కనిపిస్తున్నాయి. ఈ తరం అతిలోక సుందరిగా కనిపిస్తుంది. ముఖ్యంగా తన చూపులతో ప్రతి ఒక్కరినీ తన అభిమానులుగా చేసుకుంటుంది. అందానికే అసూయ పుట్టించేలా ఉన్న జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.