సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (14:59 IST)

జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారం... నెట్టింట వైరల్

jhanvi kapoor
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల వైపు కూడా దృష్టి సారిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మరాఠా మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, నటుడు శిఖర్ బహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. 
 
ఇద్దరూ జంటగా మాల్దీవులను కూడా సందర్శించారు. వీరి ప్రేమను కన్ఫర్మ్ చేసేందుకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వెబ్‌సైట్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫ్యాషన్ షోలో కలిసి కనిపించడంతో మళ్లీ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
 
ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇందులో వరుణ్ ధవన్‌తో బవాల్, అలానే మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా త్వరలో పట్టాలెక్కనుంది