ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (13:07 IST)

ఎన్టీఆర్ 30 కోసం జాన్వీ కపూర్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

jhanvi kapoor
బాలీవుడ్ తారలు దక్షిణాది సినిమాల వైపు చూడటం ప్రారంభించారు. ఈ కోవలో జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ 30తో సౌత్ అరంగేట్రం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ 30కి ఆమె సంతకాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
 
తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పింది. తాజాగా ఎన్టీఆర్ 30కి కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆమె రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్రం కోసం జాన్వీ కపూర్ 3.5 కోట్ల రూపాయలకు సంతకం చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ 30కి సంబంధించిన తుది తారాగణం, సిబ్బందిని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.  ఎన్టీఆర్ 30ని కొరటాల శివ  రూపొందించనున్నారు.