1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (09:43 IST)

ఓ సాథియా లో సాంగ్స్ బాగున్నాయి : డైరెక్టర్ క్రిష్

o sathi team with director krish
o sathi team with director krish
లవ్ సాంగ్స్, అందునా మెలోడీ ట్యూన్స్ ప్రేక్షక లోకానికి ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో, మంచి ప్రేమ కథతో 'ఓ సాథియా' అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా..దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమా లోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 
 
వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్  కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. 
 
ఈ సాంగ్ రిలీజ్ చేసిన క్రిష్.. ఓ సాథియా సినిమా యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఓ సాథియా అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రం చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా రెండో సినిమాగా ఓ సాథియా రాబోతోంది.  
 
గతంలో ఫేమస్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల  మీదుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదగా విడుదల చేసిన ఓ సాథియా టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించగా.. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా వదిలిన 'వెళ్లిపోయే' సాంగ్ యూత్ ఆడియన్స్‌కి ఎంతో కనెక్ట్ అవుతూ యమ స్పీడుగా వ్యూస్ రాబడుతోంది. 
 
ఇప్పటిదాకా వదిలిన అప్‌డేట్స్ ఈ సినిమాపై ఓ రకమైన బజ్ క్రియేట్ చేశాయి. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. 
 
సాంకేతిక బృందం; దర్శకత్వం : దివ్య భావన, నిర్మాత : చందన కట్టా, లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ జూలూరు, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్: చంద్ర తివారీ ఆవుల, కేశవ్ సాయి కృష్ణ గౌడ్,  సంగీత దర్శకుడు : విన్ను, పాటల రచయితలు : భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల
కొరియోగ్రఫర్స్ : రఘు మాస్టర్, బాబా భాస్కర్, ఆనీ మాస్టర్, ఎడిటర్ : కార్తిక్ కట్స్, కెమెరామెన్ : ఈజే వేణు, పీఆర్వో : సాయి సతీష్‌